1997లో బిల్ గేట్స్ ను క‌లిశా ఐటీ గురించి ప్ర‌స్తావించా

గుర్తు చేసిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-ChandraBabuNaidu

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 1997లో నేను మొదట మిస్టర్ బిల్ గేట్స్‌ను కలిశాన‌ని గుర్తు చేశారు. ఐటీ కోసం నా దార్శనికతను వివరించానని తెలిపారు. అప్పట్లో టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం గురించిన సంభాషణ ఇప్పుడు పాలనను మార్చడానికి, జీవితాలను స్థాయిలో మెరుగు పరచడానికి ఆవిష్కరణలను ఉపయోగించడం అనే విస్తృత లక్ష్యంతో పరిణామం చెందిందన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఈరోజు అమరావతిలోని సచివాలయంలో, స్వర్ణాంధ్ర 2047 కోసం నా దార్శనికతను నేను ప్రదర్శించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. మంత్రులు , కార్యదర్శులు కూడా ఆయనతో సంభాషించారు. మేము మా ప్రాధాన్యత రంగాలను చర్చించామన్నారు. ప్రజలను శక్తివంతం చేయడానికి , వారి జీవన నాణ్యతను పెంచడానికి గేట్స్ ఫౌండేషన్‌తో సహకరించడానికి మార్గాలను అన్వేషించడం జ‌రిగింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా బిల్ గేట్స్ మాట్లాడుతూ డ్రోన్లతో వివిధ రకాల సేవలు వినియోగించుకునే ఆలోచన అద్భుతంగా ఉందన్నారు. మలేరియా, అనీమియా జబ్బుల నివారణ కోసం అందరం కలిసి పని చేయాలని బిల్ గేట్స్ సూచించారు. సమావేశంలో గేట్స్ ను పలు అంశాలపై ప్రశ్నలు వేసి అభిప్రాయాలు కోరారు మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్. హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని ప్రశ్నించిన పయ్యావుల, దీనికి ఆసక్తికర సమాధానం చెప్పారు బిల్ గేట్స్. నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని చెప్పారు బిల్ గేట్స్.

Exit mobile version