న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , తదితర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని విన్నవించారు. పోలవరం నల్లమల ప్రాజెక్టుకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా విత్త మంత్రి స్పందించారని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, విమానయాన శాఖ మంత్రి కింజరాపు వెంకయ్య నాయుడు తో కలిసి నూతనంగా భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన బీహార్ కు చెందిన మంత్రి నితిన్ నబిన్ ను కలిశారు.
ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన సారథ్యంలో బీజేపీని మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్బంగా ఆకాంక్షించారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో అత్యంత పిన్న వయస్కుడు అయిన నితిన్ నబిన్ కు బాధ్యతలు అప్పగించడంతో బీజేపీలో సీనియర్లు ఊహించని షాక్ అయ్యారు. తన ఎంపికను ఎవరూ ఊహించ లేదు. ఇది ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా పార్టీ రాబోయే రోజుల్లో యువ నాయకత్వానికి ప్రయారిటీ ఇవ్వాలనే లక్ష్యంతోనే ముందస్తుగా నితిన్ నబిన్ కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
