రాష్ట్ర రాజధాని అమరావతిపై క‌క్ష క‌ట్టిన వైసీపీ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

hellotelugu-Amaaravathi

అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు వైసీపీని ఏకి పారేశారు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కాకుండా అడ్డంకులు సృష్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయినా ఆరు నూరైనా స‌రే తాము నిర్మించి తీరుతామ‌న్నారు . ఇప్ప‌టికే స్వ‌చ్చంధంగా పొలాలు ఇచ్చిన రైతుల‌కు డ‌బ్బులు చెల్లిస్తూ వ‌చ్చామ‌న్నారు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన వైసీపీకి విధ్వంసం మాత్రమే తెలుసు అన్నారు. రాజధానిలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రైతులపైకి వైసీపీ దండయాత్ర చేప‌ట్టింద‌న్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోవడం ఇష్టం లేని వైసీపీ ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతోంద‌న్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో చేసిన పర్య‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. ఆ పార్టీ అగ్ర నేత జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు షాక్ ఇచ్చినా , 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా ఇంకా బుద్ది రాలేద‌న్నారు.

మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తాం అన్నారు. గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడిందని ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు. ఐదేళ్ల పాటు తాత్సారం చేసిన గొడ్డలి పార్టీ అభివృద్ధిని ఆమడదూరం పెట్టింద‌న్నారు. గొడ్డలి పార్టీ నేతలు మోసాలు చేయటంలో దిట్టలు అని ఎద్దేవా చేశారు. అమరావతి చట్టం కూడా అయిపోయాక మావిగన్ అంటున్నారని ఇదెక్క‌డి చోద్యం అని ప్ర‌శ్నించారు. మావిగన్ అంటే ఎవరికీ అర్ధం కాదు. అందరూ ఛీ కొడుతున్నారని, బాధ్యతలేని రాజకీయ పార్టీ ప్రజలను, వారి నిర్ణయాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకు పోతే వెంటనే స్పందించి ఆ గేటు బిగించి కొత్తగా 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశాం అన్నారు. ఏపీ, తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని చెప్పారు

Exit mobile version