అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఏఐ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఏఐ, క్వాంటం కోసం ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో చేతులు కలుపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబబు నాయుడు. సీఓఈ అమరావతిని సెక్యూర్ ఏఐ కోసం డిజిటల్ ఎంబసీగా ఉంచుతుందని అన్నారు.
ఇది యుఎన్ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా సార్వభౌమ, సైబర్ సెక్యూర్ ఏఐ విస్తరణలను అనుమతిస్తుందని స్పష్టం చేశారు . ఈ సహకారం అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, ప్రపంచ భాగస్వామ్యాలను తెస్తుందని అన్నారు, ఆంధ్రప్రదేశ్‌ను విశ్వసనీయ ఏఐ, క్వాంటం సంసిద్ధత ప్రపంచ పటంలో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేయడం జరిగిందన్నారు. యూనిక్ డైరెక్టర్ సమీర్ చౌహాన్ మరియు యూనిక్ ఏఐ హబ్ చీఫ్ అనుషా దండపాణిని కలవడం, సంభాషించడం సంతోషంగా ఉందని అన్నారు.
