AP Cabinet : అమరావతి – సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక అంశాలపై చర్చించంది. ప్రధానంగా ఏపీని ఎలక్ట్రానిక్స్ తయారీకి కేరాఫ్ గా , హబ్ గా తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం . ఈ సందర్బంగా ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్ (AP Cabinet). ఎస్ఐపీబీ పెట్టుబడులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది కేబినెట్.
AP Cabinet Approved
సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు ఓకే చెప్పింది. ఇప్పటికే అమరావతి కౌలు రైతులకు రావాల్సిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్ట సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంపై కేబినెట్ చర్చింది. దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీఎంఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలకు ఓకే చెప్పింది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఔట్లకు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చర్చించింది.
వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శి పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. 815 పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. విద్యుత్, జలవనరుల శాఖకు చెందిన పనులకు ఆమోదం తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌కు కూడా ఓకే చెప్పింది. అంతే కాకుండా పొగాకు కొనుగోళ్లలో రైతులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో తొక్కిసలాటపై ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. జడ్జిలకు ఏడుగురు డ్రైవర్లను కేటాయింపునకు ఓకే చెప్పింది.
Also Read : Donald Trump Warning : ఇండియన్స్ కు ఐటీ జాబ్స్ ఇవ్వొద్దు : ట్రంప్
