AP BJP Chief PVN Madhav Satisfied : ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ సూప‌ర్

ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ కామెంట్

Hello Telugu - AP BJP Chief PVN Madhav Satisfied

Hello Telugu - AP BJP Chief PVN Madhav Satisfied

PVN Madhav : అమ‌రావ‌తి – ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అద్భుతంగా కొన‌సాగుతోందంటూ స్ప‌ష్టం చేశారు రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ (PVN Madhav). ఆయ‌న రాష్ట్రంలో చాయ్ పే చ‌ర్చా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 1967 మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జనసంఘ్ ఆధ్వర్యంలో మొదటి జెండా ఎగరేసింది నెల్లూరు లోనేన‌ని చెప్పారు. నెల్లూరు మాధవరావు గెలుపు తో ప్రారంభమైంద‌ని అన్నారు. రాయలసీమ లో సార‌ధ్యం యాత్ర పూర్తయింద‌న్నారు. రాయలసీమ తొలి గడప కడప నుంచి ప్రారంభమై విజయవంతంగా రాయలసీమ లో యాత్ర పూర్తి చేసుకున్నామని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కి ఆమోదం తెలిపార‌న్నారు.

AP BJP Chief PVN Madhav Praises AP Govt

ఈ సార‌థ్యం యాత్ర‌ లో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. చాయ్ పే చర్చ లో భాగంగా ప్రతి ఒక్కరితో మమేకం అవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రపంచ స్థాయి వ్యక్తి గా ఎదిగిన నరేంద్ర మోదీ సార‌థ్యంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింద‌ని, ప్రతి ఒక్కరి విలువైన సూచనలని తీసుకోవడం జ‌రిగింద‌న్నారు బీజేపీ చీఫ్‌. బీజేపీ స్థానిక సమస్యలని ప్రభుత్వంతో చర్చించి వాటిని పరిష్కరించి డబల్ ఇంజిన్ సర్కార్ రుచి చూపిస్తామన్నారు. ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు రాష్ట్రానికి పెట్టుబ‌డుల రూపంలో వ‌చ్చాయ‌న్నారు మాధ‌వ్.

Also Read : YS Jagan Shocking Comments : ఉప ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలి – జ‌గ‌న్ రెడ్డి

Exit mobile version