Ghaati : టాలీవుడ్ అందాల నటి అనుష్క శెట్టి ప్రస్తుతం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. బాహుబలి విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, తనదైన గుర్తింపు సాధించగలిగింది. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాల్లో నటించిన అనుష్కలో, నిశ్శబ్దం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే మిగిలిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.
Anushka Shetty Ghaati Movie Updates
ఇక ఇప్పుడు అనుష్క ‘ఘాటి’ (Ghaati) అనే క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా, విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది.
తాజాగా విడుదల చేసిన టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ ఆవిష్కరించారు. ఇందులో అనుష్క పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ గూస్‌బంప్స్ తెప్పించే నటనతో అలరించింది. యాక్షన్, ఎమోషన్, థ్రిల్ అంశాలను సమన్వయం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.
దీంతో, చాలా కాలం తర్వాత అనుష్క మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించనున్నందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా విడుదల తర్వాత దాని విజయంపై నిలిచింది.
Also Read : GST Reforms – Smartphone Price : జీఎస్టీ సవరణ తో తగ్గనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు
