Anuparna Roy : భారత దేశానికి చెందిన దర్శకురాలు అనుపర్ణ రాయ్ (Anuparna Roy) చరిత్ర సృష్టించారు. 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉత్తమ దర్శకురాలిగా గెలుపొందారు . అనురాగ్ కశ్యప్ సమర్పణలో రాయ్ చిత్రం వెనిస్‌లోని ఒరిజోంటి విభాగంలో ఏకైక భారతీయ టైటిల్‌గా నిలిచింది .తను సాంగ్స్ ఆఫ్ పర్గాటెన్ ట్రీస్ అనే పేరుతో సినిమా తీశారు. ఇందుకు గాను అవార్డు జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా తనను బెస్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ఈ చిత్రం కథ ప్రధానంగా ఇద్దరు వలస మహిళల ఒంటరితనం, మనుగడ, తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇందులో.
Anuparna Roy Success
ఇదిలా ఉండగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్సవ ముగింపు వేడుకలో ఒరిజోంటి జ్యూరీ అధ్యక్షురాలు ఫ్రెంచ్ చిత్ర నిర్మాత జూలియా డుకోర్నౌ ఈ అవార్డును ప్రకటించారు. తెల్లటి చీర ధరించిన అనుపర్ణ రాయ్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఎంచుకున్న అంశం ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసేలా ఉందని ప్రశంసలు కురిపించారు. నిర్మాత కశ్యప్, దర్శకురాలు అనుపర్ణ, ఇందులో నటించిన వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ సందర్బంగా ఉత్తమ దర్శకత్వ విభాగంలో తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనుపర్ణ రాయ్.
ఇది తనకు దక్కిన గౌరవం కాదని, తన లాంటి కోట్లాది భారతీయ మహిళలకు దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు దర్శకురాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు తీసేందుకు ఈ అవార్డు దోహదం చేస్తుందన్నారు.
Also Read : Rohit Sharma Shocking Comments : నా రికార్డ్ బ్రేక్ చేసే సత్తా శాంసన్ కే ఉంది



















