అన్నమయ్య సంకీర్తనలు ఆత్మను ఆవిష్కరించే తరంగాలు

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆచార్య రాజగోపాల ఆచార్యులు

Hellotelugu-TTDSankeertanaa

తిరుపతి : ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తగ్గిన భక్తి భావాన్ని పునరుద్ధరించి, ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి విస్తృతంగా ప్రచారం చేశారని భీమవరం ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య రాజగోపాలాచార్యులు అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలులో భాగంగా అన్నమాచార్య కళా మందిరంలో జరిగిన సాహితీ సదస్సులు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రాజగోపాలాచార్యులు “అన్నమయ్య – తాత్త్వికత” అనే అంశంపై మాట్లాడారు వైరాగ్యం, విరక్తి, కోరికల నియంత్రణ వంటి విలువలను ప్రజలకు బోధిస్తూ ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడిపించేందుకు అన్నమయ్య సంకీర్తనలు రచించారని పేర్కొన్నారు. వేదాంత సారాన్ని భక్తి రూపంలో సామాన్యులకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అని ఆయన అభివర్ణించారు. నామ సంకీర్తన, నామ జపం ద్వారా జాతి, కుల, మతాలకు అతీతంగా భగవంతుని చేరుకోవచ్చని తెలిపారు. శ్రీవారిని సంకీర్తనల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో అన్నమయ్య చేసిన కృషి అపారమని కొనియాడారు.

Exit mobile version