Anil Ravipudi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి. తను ఏ సినిమా తీసినా మినిమం రూ. 100 కోట్లు కలెక్షన్స్ చేయాల్సిందే. తాజాగా దిల్ రాజు నిర్మించిన తను దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఏకంగా ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. సినీ వర్గాలను సైతం విస్తు పోయేలా చేసింది. ఇదే దిల్ రాజు నిర్మించిన రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డిజాస్టర్ గా నిలిచింది. ఈ తరుణంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) మెగాస్టార్ చిరంజీవి, లవ్లీ బ్యూటీ నయనతారతో కలిసి బిగ్ మూవీ తీస్తున్నాడు. ఆల్ రెడీ ఇది షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుగుతోంది.
Anil Ravipudi Comments
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫుల్ ఖుష్ లో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి . ఎందుకంటే తను తీసిన మూవీ సూపర్ సక్సెస్ కావడం, మెగాస్టార్ లాంటి హీరో తనకు ఛాన్స్ ఇవ్వడం . ఈ సమయంలో తను దర్శకత్వం వహించిన నందమూరి బాలకృష్ణ, శ్రీలీల కలిసి నటించిన చిత్రం భగవంత్ కేసరి మూవీకి ఊహించని విధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు అనిల్ రావిపూడి. పనిలో పనిగా భగవంత్ కేసరికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్. త్వరలోనే బాలయ్యతో సీక్వెల్ తీసే ఆలోచన ఉందన్నాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.
Also Read : Hero Rajinikanth – Coolie : రజనీకాంత్ కూలీ ట్రైలర్ సూపర్

















