Anasuya : ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో స్టార్ మాలో ప్రాసరం అయ్యే బిగ్ బాస్ -9 రియాల్టీ షోలో తాను పాల్గొంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంపై స్పందించారు. మంగళవారం అనసూయ (Anasuya) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను బిగ్ బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం లేదంటూ స్పష్టం చేసింది. ఇదంతా పూర్తిగా అబద్దమన్నారు. తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తను సినిమాలలో , ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్నట్లు పేర్కొంది అనసూయ భరద్వాజ్. తనకు తన కుటుంబం అంటే చచ్చేంత ఇష్టమని, తన భర్త, తల్లిదండ్రులు, పిల్లలను విడిచి ఉండలేమంటూ వెల్లడించింది.
Anasuya Key Comments on Bigg Boss Entry
ఇదిలా ఉండగా తను మొదటి నుంచి ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సీరియస్ పాత్ర కూడా చేశారు ఆ మధ్యన. తెలంగాణలో రజాకార్లు చేసిన దారుణాలపై సినిమాలో నటించారు. తన కుటుంబమే తనకు ముఖ్యమన్నారు. ఏదైనా పార్టిసిపేట్ చేస్తే తానే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తానని వీటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ 9లో కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలేఖ్య పికిల్స్ చిట్టి రమ్య, దీపిక, దేబ్జాని, కావ్య, తేజస్విని, శివ కుమార్, రీతు చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, ఇమ్మాన్యుయేల్ , సాకేత్ ఉన్నారు. కాగా అనసూయ భరద్వాజ్ పుష్ప 2: ది రూల్ లో కీ రోల్ పోషించింది. రజాకార్ లో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది.
Also Read : Gujarat High Court Exclusive : ఆశారాం బాపు బెయిల్ పొడిగింపు


















