Anasuya Bharadwaj Shocking Comments : నా దుస్తులు నా ఇష్టం మీకెందుకంత క‌ష్టం..?

నిప్పులు చెరిగిన యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్

Hello Telugu - Anasuya Bharadwaj Shocking Comments

Hello Telugu - Anasuya Bharadwaj Shocking Comments

Anasuya Bharadwaj : హైద‌రాబాద్ – యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (Anasuya Bharadwaj) భావోద్వేగానికి లోన‌య్యారు. సుదీర్ఘ లేఖ రాశారు. నా డ్రెస్సులు నా ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇటీవల నా డ్రెస్సింగ్ పై ఇష్టానుసారంగా రాశారంటూ వాపోయారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితంతో వాళ్ల‌కు ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించారు. న‌చ్చిన దుస్తులు ధ‌రించ‌డం నా వ్య‌క్తిగ‌తం అని పేర్కొన్నారు. నా అభిరుచికి త‌గ్గ‌ట్టు నేనుంటా. ఇద్దరు పిల్లలకు తల్లి అయినంత మాత్రాన నా ఇష్టాలను, వ్యక్తిత్వాన్ని వదులు కోవాలా అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Anasuya Bharadwaj Shocking Comments

రాను రాను మ‌హిళ‌లంటే గౌర‌వం లేకుండా పోయింద‌న్నారు. ఒక‌రి గురించి లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం, దుష్ప్ర‌చారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. త‌మ‌కంటూ వ్య‌క్తిత్వం అనేది ఉంటుంద‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్. ప‌దే ప‌దే కించ ప‌రిచేలా, మ‌న‌సు నొచ్చుకునేలా, కుటుంబం త‌ల దించుకునేలా, వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగించేలా కామెంట్స్ చేస్తున్నార‌ని వాపోయారు. అంతే కాకుండా త‌మ స్థాయిని మ‌రిచి పోయి లేకి రాత‌లు రాస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

తాను కూడా చ‌దువుకున్నాన‌ని ఇలాంటి కామెంట్స్ వ‌ల్ల పిల్ల‌లు ఇబ్బంది ప‌డ‌తార‌న్న సోయి లేకుండా సోష‌ల్ మీడియాలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ ఇళ్ల‌ల్లో కూడా మ‌హిళ‌లు ఉంటార‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు అనసూయ భ‌ర‌ద్వాజ్. తాను సినిమాల‌లో పాత్ర‌ల‌కు త‌గిన‌ట్లుగా దుస్తులు వేసుకుంటున్నాని, ఇందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించింది యాంకర్. దేనినైనా తాను పాజిటివ్ గా తీసుకుంటాన‌ని, వీటిని ప‌ట్టించుకోనని పేర్కొన్నారు.

Also Read : Minister Kandula Durgesh Proven : ఆగ‌స్టు 1న గండికోట ప‌ర్యాట‌క ప్రాజెక్టుకు శంకుస్థాప‌న

Exit mobile version