ఆక‌ట్టుకున్న ‘అనగనగా ఒక రాజు’

యూత్, ఫ్యామిలీస్ ఫుల్ ఖుష్

hellotelugu-AnaganagaOkaRoju

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ వేళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రాల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో ముందంజ‌లో ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డింపుల్ హ‌యతి, ఆషికా రంగ‌నాథ్ క‌లిసి న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ ఆశించిన మేర ఆకట్టుకోలేక పోతోంద‌ని టాక్. మ‌రో వైపు ఇదే పండుగ సీజ‌న్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టించిన చిత్రం ది రాజా సాబ్ బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లా ప‌డింది. ఇక తాజాగా ఈ సినిమాల‌తో పాటు విడుద‌లైన మ‌రో మూవీ అన‌గ‌న‌గా ఒక రోజు చిత్రం.

ఇందులో న‌వీన్ పోలిశెట్టి, చాందిని చౌద‌రి కీ రోల్స్ పోషించారు. ద‌ర్శ‌కుడు సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. ప్ర‌త్యేకించి చిత్రాన్నియూత్, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను బాగా ఎంగేజ్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. మొత్తంగా కామెడీ పండింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు మంచి రిచ్ ఫీల్ ఇచ్చాయి. ఇక విక్ట‌రీ వెంకీతో క‌లిసి సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రంలో దుమ్ము రేపిన మీనాక్షి చౌదరి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది ఈ సినిమాలో. నవీన్‌తో ఆమె స్క్రీన్ పెయిర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాయి. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.

Exit mobile version