Amit Shah : బీహార్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీయే మధ్య కొనసాగుతోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీహార్‌లో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోతుందని జోష్యం చెప్పారు. ఛతి మైయ్యా జాతిని అవమానించారంటూ ఏఐసీసీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపణలు చేశారు. మరోసారి ఎన్డీయే కూటమి పవర్ లోకి రావడం ఖాయమని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇండియా కూటమి నేతలు కలలు కంటున్నారని, వారి కలలు కల్లలు కావడం ఖాయమన్నారు. వారికి అంత సీన్ లేదన్నారు.
Amit Shah Slams India Alliance
ఎన్నికలలో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు; బీహార్‌లో కొత్త వైద్య కళాశాల, సీతా ఆలయ ప్రాజెక్టును ప్రకటించారు . బీహార్ ఎన్నికల్లో ఇండియా బ్లాకు తుడిచి పెట్టుకు పోతుందన్నారు. ప్రధాని మోడీ తల్లిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు, అదే సమయంలో రాష్ట్రంలో ఎన్డీఏ తీసుకు వచ్చిన ప్రాజెక్టులను హైలైట్ చేశారు. మోదీ తల్లిని, ఛతి మైయ్యా జాతిని ఎగతాళి చేసినదుకు తప్పకుండా ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా . 10 సంవత్సరాల పాలనలో యుపీఏ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడిందని, అయితే అవినీతి విషయంలో మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లను ఎవరూ వేలు ఎత్తి చూపలేరని ఆయన స్పష్టం చేశారు.
Also Read : CM Revanth Reddy Clear Instructions : సహాయక చర్యలు ముమ్మరం చేయండి
