జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అంబ‌టి రాంబాబు భేటీ

జైలు నుంచి విడుద‌లైన మాజీ మంత్రి

hellotelugu-AmbatiRambabu

అమ‌రావ‌తి : అక్ర‌మ కేసుల్లో ఇరుక్కుని జైలు నుంచి విడుద‌లైన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇవాళ త‌మ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో త‌న నివాసంలో క‌లుసుకున్నారు. అక్రమ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబుకు కోర్టుకు ఊర‌ట క‌లిగింది. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్‌ యాక్షన్‌ వంటి అంశాలను వైయస్‌ జగన్‌కు వివరించారు అంబటి రాంబాబు, తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డి.

అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబ‌ట్టారు వైయస్‌ జగన్‌. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని అన్నారు. పార్టీ నాయకులు, క్యాడర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని మీకంద‌రికీ తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు.

Exit mobile version