Alyssa Healy : ఢిల్లీ : ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టి నుంచి గౌహతి వేదికగా భారత్ , శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా వరల్డ్ కప్ గురించి స్పందించింది. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి ఒక్క జట్టు తమను ఓడించాలని అనుకుంటుందన్నారు. కానీ వారు అనుకున్నంత ఈజీ కాదన్నారు. తాము కప్ మరోసారి ఎగరేసుకు పోవాలని డిసైడ్ అయి వచ్చామన్నారు. ఉట్టి చేతులతో వెళ్లేందుకు రాలేదన్నారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Alyssa Healy Shocking Comments
ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ జట్టును నడిపించడం, ఒత్తిడిని నిర్వహించడం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేను చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టానని చెప్పారు . అది జట్టును వన్డే ప్రపంచ కప్‌కు నడిపించడం పైనే ప్రత్యేకంగా దృష్టి సారించానని అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఊరికే వదలనని పేర్కొన్నారు. తమ జట్టులో బ్యాటర్స్ , బౌలర్లతో పాటు ఆల్ రౌండర్లు కూడా సమర్థవంతంగా ఉన్నారని, వారంతా అన్ని జట్లను ఎదుర్కొనేందుకు సిద్దమై ఉన్నారని స్పష్టం చేశారు. ఏ స్థానంలోనైనా తాము గెలిచి తీరుతామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్ ప్రారంభం సందర్బంగా గౌహతి స్టేడియంలో ఇటీవలే మరణించిన అస్సాం భూమి పుత్రుడు, అమర గాయకుడు జుబీన్ గార్గ్ కు నివాళిగా సంగీత కచేరి ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read : Kuldeep Yadav Sensational : ఆసియా కప్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ వన్
