Allu Aravind : హైదరాబాద్ – టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 101 కోట్ల రుణం ఎగ్గొట్టిన కేసులో తన పేరు ఉండడంతో తనను విచారణకు ఈడీ పిలిచిందని పేర్కొన్నారు. తనకు ఆ స్కాంతో సంబంధం లేదన్నారు. 2017లో ఓ మైనర్ వాటాదారుడి నుంచి ఓ ఆస్తి కొనుగోలు చేశానని తెలిపారు. దర్యాప్తులో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో తన పేరు కనిపించిందని అందుకే హాజరైనట్లు చెప్పారు.
Allu Aravind Comments
విచారణలో భాగంగా మనీ లాండరింగ్ కింద కేసును దర్యాప్తు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ). ఊహించని రీతిలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో ప్రధానంగా నిర్మాత అల్లు అరవింద్ పేరు కనిపించింది. దీంతో తన ప్రమేయం ఉండడంతో వెంటనే హాజరు కావాల్సిందిగా నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.
గత్యంతరం లేక అల్లు అరవింద్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా నిర్మాతపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఏకంగా మూడు గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. అల్లు అరవింద్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో మరోసారి ఝలక్ ఇచ్చింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో హైదరాబాద్ లోని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017-19 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్లు గుర్తించింది ఈడీ. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడారని గుర్తించింది. మొదట సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు సంస్థ ప్రారంభించింది.
Also Read : Allu Aravind Shocking : బ్యాంకు స్కామ్ లో అల్లు అరవింద్ విచారణ



















