Allu Aravind : హైదరాబాద్ – ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఇంట విషాదం అలుముకుంది. తన తల్లి కనకరత్నమ్మ శనివారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు.ఆమె ఎవరో కాదు ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య. ఆయన కొడుకే ఈ అల్లు అరవింద్. స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ కు నాయినమ్మ. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ తల్లి. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ హుటా హుటిన విషయం తెలిసిన వెంటనే ఇంటికి చేరుకున్నారు. కనకరత్నమ్మ వయసు 94 ఏళ్లు. ఇదిలా ఉండగా ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయని స్పష్టం చేశారు నిర్మాత అల్లు అరవింద్.
Allu Aravind Mother No More
నటులు అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో ఉండటానికి వారి సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. అల్లు అర్జున్ ముంబై నుండి విమానంలో వస్తున్నాడు, రామ్ చరణ్ ఇంటికి తిరిగి రావడానికి మైసూర్‌లో తన షూటింగ్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ సంవత్సరం మార్చిలో, కనకరత్నమ్మ హైదరాబాద్‌లో ఆసుపత్రి పాలయ్యారు. రెండు సంవత్సరాల క్రితం అల్లు రామలింగయ్య 100 సంవత్సరాల వారసత్వాన్ని స్మరించుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు కనకరత్నమ్మ. ఆమె తన భర్త ను మరోసారి గుర్తు చేసుకుంటూ వీల్ చైర్ పై తీసుకు వచ్చారు. అల్లు అరవింద్ తల్లి మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Also Read : Federal Court Shocking Trump : ట్రంప్ కు షాక్..సుంకాలు చట్ట విరుద్దం
