Federal Court Shocking Trump : ట్రంప్ కు షాక్..సుంకాలు చ‌ట్ట విరుద్దం

సంచ‌ల‌న తీర్పు చెప్పిన ఫెడ‌ర‌ల్ కోర్టు

Hello Telugu - Federal Court Shocking Trump

Hello Telugu - Federal Court Shocking Trump

Federal Court : అమెరికా – అమెరికా దేశ అధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇష్టానుసారంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ఇత‌ర దేశాల‌ను ఇబ్బంది పెడుతున్న త‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఫెడ‌ర‌ల్ అప్పీల్స్ కోర్టు (Federal Court). భార‌త దేశంతో స‌హా ఇత‌ర దేశాల‌పై నిరంకుశంగా, ఏక‌ప‌క్షంగా సుంకాల‌ను విధించ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఇది పూర్తిగా దేశ రాజ్యాంగానికి , చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొంది. ఏ దేశ‌మైనా ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణితో ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. కానీ నేనే సుప్రీం అంటే కుద‌ర‌ద‌ని స్పష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఐఈఈపీఏ కింద అత్య‌వ‌స‌ర అధికారాల‌ను ఉప‌యోగించ‌డం కూడా పూర్తిగా త‌ప్పేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఒక‌ర‌కంగా కోలుకోలేని దెబ్బ ట్రంప్ కు.

Federal Court Shocking to Trump

అవసరమైన‌ వస్తువులపై ఖర్చులను తగ్గించడం, సమాఖ్య ప్రభుత్వాన్ని పునర్వ్యవ స్థీకరించడం , దిగుమతులపై సుంకాలను విధించడం ద్వారా అమెరికాను మళ్లీ పూర్వ‌పు స్థితిలోకి తీసుకు వ‌చ్చేందుకే తాను ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ట్రంప్ న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది కోర్టు. కాగా ట్రంప్ త‌న రెండో ప‌ద‌వీ కాలంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టారిఫ్ ల‌ను విధించ‌డం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక వ్య‌క్త‌మైంది. ప్ర‌త్యేకించి ఆయ‌న త‌న అక్క‌సునంతా భార‌త దేశంపై వెళ్ల‌గ‌క్కారు. ఏకంగా 50 శాతం సుంకాల‌ను విధించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఇండియా స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ సైతం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇండియా ఎవ‌రిపై ఆధార‌ప‌డి లేద‌ని పేర్కొన్నారు.

Also Read : India GDP Growth Sensational : 7.8% ఆర్థిక వృద్ధితో దూసుకుపోతున్న భారత్

Exit mobile version