Hero Akshay Kumar : సైబ‌ర్ మోసాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి

పిలుపునిచ్చిన బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్

Hello Telugu - Hero Akshay Kumar

Hello Telugu - Hero Akshay Kumar

Akshay Kumar : ముంబై : బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయుధాల కంటే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంది సైబ‌ర్ మోసం అన్నారు. రోజు రోజుకు టెక్నాల‌జీ రాకెట్ కంటే వేగంగా అభివృద్ది చెందుతున్న‌ప్ప‌టికీ అంత‌కంటే ఎక్కువ‌గా నేరాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంద‌న్నారు. దీనిని మొదటి ప్రాధాన్య‌త‌గా గుర్తించాల‌ని కోరారు. ఇందుకు సంబంధించి త‌న ఇంట్లో త‌న కూతురుకు జ‌రిగిన ఘ‌ట‌న గురించి అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

Akshay Kumar Comments

కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కూతురు వీడియో గేమ్ ఆడుతోంది మీరు ఎవరితోనైనా ఆడగల కొన్ని వీడియో గేమ్‌లు ఉన్నాయి. మీకు తెలియని అపరిచితుడితో ఆడుకుంటున్నారు. మీరు ఆడుకుంటున్నప్పుడు, కొన్నిసార్లు అక్కడి నుండి ఒక సందేశం వస్తుంది. అప్పుడు ఒక సందేశం వచ్చింది, మీరు మగవారా లేదా ఆడవారా అని. కాబట్టి త‌ను స్త్రీన‌ని చెప్పింది. అటు వైపు నుంచి ఇంకో మెస్సేజ్ వ‌చ్చింది. మీ న‌గ్న చిత్రాల‌ను నాకు పంప‌గ‌ల‌రా అని. దీంతో నా కూతురు వెంట‌నే ఆ చాటింగ్ ను ఆపేసి ఈ విష‌యాన్ని వ‌చ్చి త‌న త‌ల్లికి చెప్పింది.

ప్ర‌తి చోటా ఈ దేశంలో చాటింగ్ ఇలాగే ప్రారంభం అవుతోంద‌ని చెప్పారు న‌టుడు అక్ష‌య్ కుమార్. ఇది కూడా సైబర్ నేరంలో ఒక భాగం అన్నారు. ప్ర‌త్యేకించి మహారాష్ట్ర రాష్ట్రంలో 7వ త‌ర‌గ‌తి, 8వ త‌ర‌గ‌తి, 9వ త‌ర‌గ‌తి, 10వ త‌ర‌గ‌తి చ‌దివే ప్ర‌తి విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌తి వారం సైబ‌ర్ పీరియ‌డ్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఇది త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని సూచించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్ ను. అక్క‌డ ప్ర‌త్యేకంగా సైబ‌ర్ మోసాల గురించి వివ‌రించాల‌ని, వారికి అవ‌గాహ‌న క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు అక్షయ్ కుమార్.

Also Read : Chandu Janardhan Strong Demand : జీవో 5 ను పూర్తిగా ర‌ద్దు చేయాలి : చందు జ‌నార్ద‌న్

Exit mobile version