ఉత్తర ప్రదేశ్ : డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం అఖండ -2 తాండవం అద్బుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా సనాతన ధర్మం విశిష్టతను, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మం గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇదిలా ఉండగా కుంభమేళా సందర్బంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా బాసిల్లిన వారణాసిలో అఖండ -2 మూవీకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్స్ చిత్రానికి హైలెట్ గా మారాయి.
అఖండ -1 ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ ఏడాదిలో బాలకృష్ణకు మంచి ఊపు ఇచ్చేలా టాక్ రావడంతో తన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే సమయంలో వివిధ హిందూ వర్గాల నుంచి పెద్ద ఎత్తున సానుకూలమైన స్పందన లభిస్తోంది. ప్రత్యేకించి దర్శకుడు బోయపాటి శ్రీను పెట్టిన ఎఫర్ట్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా తనకు మంచి కాంప్లిమెంట్ కూడా లభించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సైతం అఖండ -1 తాండవం సినిమా చూశారు. ఆపై బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సనాతన ధర్మం ప్రాధాన్యత ఏమిటో అద్బుతంగా తెర మీద ఆవిష్కరించారంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుతం అఖండ -2 టీం వారణాసిలో సందడి చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=iFJYAvNWHuI



















