Ajwain Leaves : ప్రకృతి పరిరక్షించిన ఔషధ గుణాలలో వాము ఆకులు ప్రధానమైనవి. సాధారణంగా ప్రతి ఇంటి పక్కన పెరిగే ఈ ఆకులు, అనేక ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారంగా నిలుస్తున్నాయి. తాజాగా ఆయుర్వేద నిపుణులు వాము ఆకుల (Ajwain Leaves) వినియోగం పై చేసిన పరిశోధనల ప్రకారం, ఇవి శరీరంలో వివిధ రకాల తలనొప్పులు, జలుబు, అజీర్ణం, రక్తపోటు వంటి సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తాయన్న విషయం వెల్లడైంది.
Ajwain Leaves – శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం
వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు వాము ఆకులు (Ajwain Leaves) సహజ నివారణగా సూచించబడుతున్నాయి. ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు కొన్ని వాము ఆకులను నలిపి వాటి వాసన చూడటం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియకు సహాయకం
వాము ఆకులు జీవక్రియను మెరుగుపరుస్తాయని, అజీర్ణ సమస్యతో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నివారణకు వాము ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలుస్తోంది.
పోషక విలువలు
వాము ఆకుల్లో విటమిన్ A, C, జింక్, సెలీనియం వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే లక్షణాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణ
వాము ఆకులు అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందనే సూచనలు ఉన్నాయి.
డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరం
వాము ఆకులతో తయారైన కషాయం (డికాషన్) తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
శరీర శుద్ధికి సహాయం
వాము ఆకులు టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపించడంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీ రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నవారికి కూడా ఇది మేలు చేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రోగనిరోధక శక్తి పెంపు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల వాము ఆకులు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
మహిళల ఆరోగ్యానికి మేలు
పీరియడ్స్ సమయంలో అధిక నొప్పులతో ఇబ్బందిపడే మహిళలకు వాము ఆకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
Also Read : Heart Health Shocking Facts : షుగర్ ఫ్రీ కదా లాగిస్తున్నారా అయితే మీ హార్ట్ జాగ్రత్త



















