Ajit Doval Fired on American Media : విదేశీ మీడియాపై భ‌గ్గుమ‌న్న అజిత్ దోవ‌ల్

ఆధారాలు లేకుండా అవాస్త‌వాలు రాస్తే ఎలా

Hello Telugu - Ajit Doval Fired on American Media

Hello Telugu - Ajit Doval Fired on American Media

Ajit Doval : న్యూఢిల్లీ – భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ సీరియ‌స్ అయ్యారు. భార‌త దేశంపై అడ్డ‌గోలుగా రాత‌లు రాస్తే, అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌తి దానికి ఓ గీత అనేది ఉంటుంద‌ని, దానిని దాటే ప్ర‌య‌త్నం చేస్తే మంచిది కాద‌ని సున్నితంగా చుర‌క‌లు అంటించారు. పాకిస్తాన్ కు జ‌రిగిన న‌ష్టం ఏం జ‌రిగిందో చెప్పాల‌న్నారు. శ‌నివారం అజిత్ దోవ‌ల్ (Ajit Doval) మీడియాతో మాట్లాడారు.

Ajit Doval Slams

ప్ర‌పంచంలో అత్యంత జుగుస్సార‌కంగా, స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా, త‌ల దించుకునేలా ఉగ్ర‌వాదాన్ని, టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఒక్క‌టేన‌ని , ఆ విష‌యం యావ‌త్ ప్ర‌పంచానికి తెలుస‌న్నారు. కానీ అమెరికా ప‌నిగ‌ట్టుకుని భార‌త్ ను ఇబ్బంది పెట్టేలా, త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా యుఎస్ మీడియా ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ దేశం ఎవ‌రికీ త‌ల దించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు అజిత్ దోవ‌ల్.

పాకిస్తాన్ కావాల‌ని త‌మ‌తో క‌య్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు. ఇక నుంచి ఉపేక్షించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. త‌మ స‌త్తా ఏమిటో దాయాది దేశంతో పాటు యావ‌త్ ప్ర‌పంచానికి కూడా తెలిసి వ‌చ్చింద‌న్నారు. తాము కావాల‌ని ఏ దేశంతోనూ యుద్దానికి దిగ‌బోమంటూ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు. కానీ గెలుక్కోవాల‌ని చూస్తే చుక్క‌లు చూపిస్తామ‌న్నారు. ఆ విష‌యం పాకిస్తాన్ కు అనుభ‌వంలో తెలిసి వ‌చ్చింద‌న్నారు. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా వెంటాడి, వేటాడుతూనే ఉంటామ‌ని అన్నారు అజిత్ దోవ‌ల్.

Also Read : TTD EO Shyamala Rao Hopeful : తిరుమ‌ల‌లో అభివృద్ది ప‌నులు పూర్తి చేయాలి

Exit mobile version