పోలీస్ ఉద్యోగాల‌కు వ‌యో ప‌రిమితి పెంపు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తెలంగాణ ప్రభుత్వం

hellotelugu-TelanganaGovt

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ ప‌డే నిరుద్యోగుల వ‌యో ప‌రిమితి స‌డ‌లిస్తున్న‌ట్లు తెలిపింది. సీఎం ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎస్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితి మరో రెండేళ్లు పెంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ (పోలీస్) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఎక్సైజ్‌, రవాణా, అటవీ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే 18 మేన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ పోస్టులకు నిర్దేశిత గరిష్ట వయో పరిమితికి అదనంగా ఐదేళ్ల వయో సడలింపు కల్పించారు. తాజాగా 14.08.2026న జారీ చేసిన http://G.O.Ms.No.122 ద్వారా ఆ ఐదేళ్ల సడలింపుకు అదనంగా మరో రెండేళ్లను పెంచారు. దీంతో నిర్దేశిత గరిష్ట వయో పరిమితిపై మొత్తం ఏడు సంవత్సరాల వరకు అదనపు వయో సడలింపు లభించనుంది .నిరుద్యోగ యువత నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరింత మంది నిరుద్యోగ యువత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత పొందేలా ఈ వయో పరిమితి పెంపు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB), తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC), సంబంధిత శాఖలు, అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు కోసం పంపించారు.

ఈ వయోపరిమితి పెంపు పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, SPF, ఎక్సైజ్‌, రవాణా, అటవీ శాఖల్లోని యూనిఫామ్‌డ్‌ సర్వీసెస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు వర్తిస్తుంది. తాజా ఉత్తర్వులు 14న జారీ అయ్యాయి.

Exit mobile version