Samson : ముంబై : మరోసారి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ లు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Samson) పట్ల వివక్షను చూపారు. తాజాగా సౌతాఫ్రికాతో ఆడే వన్డే జట్టును ఖరారు చేశారు . ఎలాంటి స్ట్రైక్ రేట్ లేక పోయినప్పటికీ ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. ఇదే వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఉన్నా పట్టించుకోలేదు. ప్రధానంగా చైర్మన్, కోచ్ లు ఇద్దరూ పనిగట్టుకుని పక్కన పెట్టేశారంటూ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. మెరిట్ కంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాతో తన చివరి వన్డేలో 100 పరుగులు చేసిన తర్వాత సంజు సామ్సన్ వన్డే సెటప్ నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు, అతను దక్షిణాఫ్రికాలో మూడు సెంచరీలు కూడా చేశారు.
Agarkar-Gambhir Shocking Sanju Samson
ఇదిలా ఉండగా వన్డే వరల్డ్ కప్ లో షమీ గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ వన్డే సెటప్ నుండి తప్పుకున్నాడు.రియాన్ పరాగ్ చాలా మంచి బ్యాటింగ్ పవర్ హిట్టర్ అయినా విస్మరించారు. తన స్థానంలో తిలక్ వర్మను ఎంపిక చేశారు. తన స్కోర్ 39, 29, 11 పరుగులు మాత్రమే చేశాడు. సంజు సామ్సన్ స్థానంలో ధ్రువ్ జురెల్ కూడా వన్డే జట్టులో 3వ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. రిషబ్ పంత్ వన్డే జట్టులో 33 సగటుతో మొత్తం మీద తెల్ల బంతితో ఆడటంలో విఫలమయ్యాడు. అయినా సెలెక్షన్ కమిటీ తనను ఏరికోరి ఎంచుకుంది. తనను ఎంపిక చేసింది. ఎంపిక కమిటీ ఇంతకంటే పక్షపాతం ఇంకేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : TTD Huge Arrangements : పంచమి తీర్థం కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు


















