Agarbatti Smoke : వర్షాకాలం ప్రారంభమై పండుగల సీజన్ మొదలైంది. నాగ పంచమి నుంచి వరుస పండుగలు రానుండగా, ప్రతి కుటుంబంలో ధూపం, అగరబత్తి (Agarbatti Smoke), సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యాల వాడకం పెరుగుతుంది. ఇవి ఇంట్లో శుభ వాతావరణాన్ని కలిగించడమే కాకుండా మానసిక శాంతిని అందిస్తాయని నమ్మకం. అయితే, తాజా అధ్యయనాలు మాత్రం దీని బహుళ వాడకంపై గంభీర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Agarbatti Smoke Effects
చైనాలోని సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు గ్వాంగ్‌డాంగ్ టొబాకో పరిశోధనా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో, అగరబత్తి నుండి వెలువడే పొగలో (Agarbatti Smoke) 99 శాతం అల్ట్రాఫైన్ సూక్ష్మకణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇవి శ్వాసకోశాల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం కలిగించగలవని పేర్కొన్నారు.
సిగరెట్ కన్నా ఎక్కువ ప్రమాదం
ఈ అధ్యయనంలో సిగరెట్ పొగతో అగరబత్తి పొగను తులన చేశారు. అందులో అగరబత్తి పొగలో ఉండే కొన్ని రసాయనాలు మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్‌గా పని చేస్తాయని గుర్తించారు. అంటే ఇవి కణజాలాన్ని నాశనం చేయడంతో పాటు క్యాన్సర్‌కు దారితీసే లక్షణాలు కలిగి ఉంటాయని స్పష్టమైంది.
శ్వాస సంబంధిత సమస్యలు
అగరబత్తి నుండి వచ్చే పొగ వలన శ్వాస నాళాల్లో మంట, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఈ పొగకు గురైనవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
కళ్ళు, చర్మానికి దెబ్బ
పొగలో ఉండే హానికరమైన రసాయనాల వలన కళ్ళలో దురద, రెడ్డితనం, కంటిచూపు బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేగాక, కొంతమందిలో చర్మ అలర్జీలు కూడా కలుగవచ్చని పేర్కొన్నారు.
భద్రతా సూచనలు
- పూజల సమయంలో వీటిని మితంగా వాడటం ఉత్తమం
- చిన్నారులు, వృద్ధులు ఉన్న చోట పొగ ఎక్కువగా ఉండే ధూపాలు, అగరబత్తులు వీలైనంత తగ్గించాలి
- గది వెంటిలేషన్ బాగుండేలా చూసుకోవాలి
- సహజమైన సుగంధ ద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణుల సూచన
పరిమితంగా ఉపయోగించినపుడు అగరబత్తులు ధార్మిక విశ్వాసానికి అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఎక్కువగా, సుదీర్ఘ కాలం వాడితే శరీరానికి తీవ్రంగా హానికరమవుతాయని తాజా పరిశోధన స్పష్టం చేసింది. అందుకే భక్తి కంటే భద్రతకే మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read : Neem Interesting Health Benefits : నేల రోజులు వేపాకులు నమిలితే ఇన్ని ప్రయోజనలో!



















