ముంబై : ఇండియాలో అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో ఐసీసీ టి20 వరల్డ్ కప్ నిర్వహించనుంది. ఈ టోర్నీ ముగిసేంత వరకు మాత్రమే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ఉంటుంది. దీంతో ఎవరు చీఫ్ సెలెక్టర్ అవుతారనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తన సారథ్యంలో భారత జట్టు ఎంపికపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లను కావాలని పక్కన పెట్టారని, కేవలం తమ వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వడం వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి ప్రధాన కారకులు ప్రధాన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ . ఇందుకు తగ్గట్టుగానే వీరు కోరుకున్న ప్లేయర్లకు ఛాన్స్ లు దక్కడం, వారు దారుణంగా విఫలం చెందడం చర్చకు దారి తీసింది.
ఈ తరుణంలో తాజాగా భారత్, శ్రీలంక నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా స్క్వాడ్ ను ఎంపిక చేశారు. ఎవరూ ఊహించని విధంగా టి20 జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆపై జితేష్ శర్మను కూడా తొలగించారు. కొత్తగా టాప్ టాలెంటెడ్ కలిగిన ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వారిలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ ఉన్నారు. తాజగా బీసీసీఐ బోర్డు మీటింగ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చివరకు గిల్ కు ఛాన్స్ ఇవ్వాలని గంభీర్, అగార్కర్ పట్టు పట్టారని, కానీ మరో ఉగ్గురు సభ్యులు ప్రజ్ఞా ఓజా, ఆర్పీ సింగ్ తో పాటు సభ్య కార్యదర్శి మద్దతు ఉండడంతో గిల్ కు ఉద్వాసన పలికినట్లు టాక్. మొత్తంగా వరల్డ్ కప్ తర్వాత అగార్కర్ పదవీ కాలం ముగుస్తుంది. తన స్థానంలో ఓజా లేదా సింగ్ చీఫ్ సెలెక్టర్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
