న్యూఢిల్లీ : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే నేవీకి కొత్త దళాధిపతిని నియమించింది కేంద్ర సర్కార్. కృష్ణ స్వామినాథన్ కొత్త నేవీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ స్వామినాథన్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పని చేస్తున్నారు. ఒక కార్యక్రమంలో అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఇదిలా ఉండగా వేగంగా మారుతున్న ప్రాంతీయ సముద్ర భద్రతా పరిస్థితుల మధ్య అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆదివారం భారతదేశపు కొత్త చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పదవీ విరమణ చేసిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో ఆయన నియమితులయ్యారు. అడ్మిరల్ స్వామినాథన్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పని చేస్తున్నారు.
జాతీయ ప్రయోజనాలు ఎక్కడ ఉన్నా వాటిని పరిరక్షించడానికి భారత నౌకాదళం అప్రమత్తంగా ఉంటుందన్నారు కృష్ణ స్వామినాథన్. సవాలుగా, సంక్లిష్టంగా, అనూహ్యంగా, అనిశ్చితంగా కొనసాగుతున్న ప్రాంతీయ భద్రతా వాతావరణంలో చాలా చురుకుగా మోహరించి ఉంది నావికాదళం అని ప్రకటించారు. భారత నౌకాదళం దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి కార్యాచరణ సంసిద్ధతను, పోరాట సామర్థ్యాన్ని కొనసాగించేలా చూడటమే నా అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణ స్వామినాథన్. భారత నౌకాదళం సామర్థ్య పెంపు, ఆధునీకరణ మార్గంలో పయనిస్తోందని స్పష్టం చేశారు.

















