సింగపూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు బిజీగా మారి పోయారు. సింగపూర్ లో మంత్రులు అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్ , పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు ఉన్నతాధికారుల బృందం విస్తృతంగా పర్యటిస్తోంది. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పాలన పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడం పై వారం రోజుల పాటు మంత్రులకు శిక్షణ ఇస్తోంది సింగపూర్ ప్రభుత్వం. బుధవారం ఉదయం సింగపూర్ హోమ్ మంత్రి షణ్ముగం తో భేటీ అయ్యారు మంత్రులు.
సింగపూర్ లో ప్రజల రక్షణ కు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై మంత్రులకు వివరించారు ఈ సందర్బంగా. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనం పై ట్రైనింగ్ ఇస్తోంది సింగపూర్ ప్రభుత్వం. మధ్యాహ్నం సింగపూర్ NUS సిటీస్ లో సమీకృత ప్రణాళికలు, భవిష్యత్ పట్టణ ప్రణాళికలు, భూపాలన అంశాలపై శిక్షణ కు హాజరు అయ్యారు మంత్రులు. తమకు వచ్చిన పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు సింగపూర్ కు చెందిన నిపుణులు. సాయంత్రం సింగపూర్ సిటీ గ్యాలరీ ను సందర్శించారు.
ఇదిలా ఉండగా శిక్షణ అనంతరం సింగపూర్ అర్బన్ ప్లానింగ్ గత 50 ఏళ్లలో సింగపూర్ ఎలా అభివృద్ధి చెందిందనే దానిపై అధ్యయనం చేశారు మంత్రులు.
