Adani Group : ముంబై – అదానీ కంపెనీలకు సంబంధించిన షేర్లు ఉన్నట్టుండి పెరిగాయి. దీంతో షేర్లు కొనుగోలుదారులు, వాటాదారులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తాజాగా అదానీ గ్రూప్ కీలక వార్షిక సమావేశం ముంబై వేదికగా జరిగింది. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అదానీ గ్రూప్ (Adani Group) కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా పవర్, రవాణా, లాజిస్టిక్, తదితర రంగాలపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ షేర్స్ కు రెక్కలు వచ్చాయి. మరో వైపు అంబుజా సిమెంట్స్ కంపెనీకి సంబంధించి 4 శాతం షేర్లు పెరగడం విశేషం.
Adani Group Shares Profitable
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరంగా చూస్తే అదానీ పవర్ షేర్లు 1.63 శాతం పెరిగితే అదానీ ఎంటర్ ప్రైజెస్ 1.44 శాతం, ఎన్డీటీవీ (మీడియా సంస్థ) 1.42 శాతం , అదానీ టోటల్ గ్యాస్ 0. 53 శాతం చొప్పున షేర్లు పెరిగాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ లోని అన్ని లిస్టెడ్ స్టాక్స్ భారీగా లాభ పడ్డాయని చెప్పక తప్పదు. ఇదే సమయంలో అంబుజా సిమెంట్స్ వార్షిక సమావేశం జరిగింది. ఈకంపెనీ షేర్లు 4 శాతం చొప్పున లాభ పడ్డాయి. ఆశావాద ఈక్విటీ మార్కెట్ కూడా గ్రూప్ షేర్లను పెంచేందుకు దోహద పడింది.
ఇక మిగతా కంపెనీల పరంగా చూస్తే సంఘీ ఇండస్ట్రీస్ 3.08 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.78 శాతం, అదానీ పోర్ట్స్ 2.58 శాతం పెరిగాయి. ఏసీసీ 1.72 శాతం, అదానీ ఎనర్జీ 1.70 శాతం చొప్పున పెరిగాయి. అదానీ గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ రాబోయే ఐదు సంవత్సరాలలో వ్యాపారాలలో రికార్డు స్థాయిలో USD 15-20 బిలియన్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు.
Also Read : DGCA Strong Focus : ఎయిర్ పోర్టులలో భద్రతా లోపాలపై డీజీసీఏ ఫోకస్



















