కోయింబత్తూరు : ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది నటి సమంత రుత్ ప్రభు. తను గత కొంత కాలం నుంచి దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటోంది. ఈ ఇద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో చాలా చోట్ల వీరు కలిసి ఉంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ మధ్యన ఇద్దరూ తిరుమల ఆలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నారా అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా సోమవారం నటి సమంతకు సంబంధించి సంచలన వార్త వెలుగు చూసింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దండలు మార్చుకున్నారని, పెళ్లి కూడా చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు.
దీనిపై నటి సమంత కానీ లేదా దర్శకుడు రాజ్ నిడిమోరు కానీ ఇంకా స్పందించ లేదు. అయితే సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నారని ప్రకటించేశారు కూడా.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాజ్ నిడిమోర్ కు పెళ్లి కూడా అయ్యింది. పెళ్లి పై సీరియస్ కామెంట్స్ చేసింది. తెగించిన మనుషులు అలాంటి పనులే చేస్తారంటూ రాజ్ భార్య శ్యామిలిదే పోస్ట్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్, పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఈషా యోగా సెంటర్ లోపల ఉన్న లింగ్ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున వివాహం జరిగినట్లు తెలిసింది. 30 మంది హాజరయ్యారని, సమంత ఎర్ర చీర ధరించినట్లు ప్రచారం ఉంది.



















