కోయంబత్తూరు : నటి సమంత మరోసారి పెళ్లికూతురిగా దర్శనం ఇచ్చింది. ఇది సినిమా అనుకుంటే పొరపాటు పడినట్లే. సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరు జగ్గీ వాసుదేవన్ నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ లోని శివాలయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత పెళ్లి పీటలు ఎక్కారు. ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఒక్కటి కాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరూ ఒక్కటైన పెళ్లి చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో తను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ తను విడి పోయింది. ఈ సందర్బంగా పెద్ద రాద్దాంతమే జరిగింది.
తను కొంత కాలంగా ముంబైలో ఒంటరిగా ఉంటోంది. విచిత్రం ఏమిటంటే తన సినీ కెరీర్ అనూహ్యంగా ప్రారంభమైంది. గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే మూవీలో కీ రోల్ పోషించింది. ఇందులో మరో పాత్రలో నటించాడు నాగ చైతన్య. ఈ సినిమా మ్యూజికల్ గా బంపర్ హిట్ గా నిలిచింది. అల్లా రఖా రెహమాన్ ఇచ్చిన స్వరాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలలో మెప్పించింది సమంత. అంతే కాదు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప -1 మూవీలో అల్లు అర్జున్ సరసన ఐటం సాంగ్ చేసింది. ఊ అంటావా మావా అని. ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సీరీస్ లో నటించింది. దీనికి దర్శకత్వం వహించాడు రాజ్ నిడిమోరు. తనకు ఇదివరకే పెళ్లి కూడా జరిగింది.



















