ముంబై : ప్రముఖ నటి మాళవిక మోహన్ తళుక్కున మెరిసింది. ప్రముఖ సినీ మ్యాగజైన్ ఫిలిం ఫేర్ కవర్ పేజీ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటిగా గుర్తింపు పొందింది. తమిళం, తెలుగు భాషలలో నటించింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి మారుతి తీసిన ది రాజా సాబ్ లో కీ రోల్ పోషించింది. ఇందులో తనతో పాటు మరో ఇద్దరు నటీమణులు కూడా పాత్రలు పోషించారు. చిత్రం ఆశించినంత మేర ఆడలేక పోయింది. ఎక్కువగా స్కోప్ లేక పోవడం కూడా సినిమాకు ఇబ్బందిగా మారింది. భారీ బడ్జెట్ తో తీశారు ఈ మూవీ. పాత్రలు సరిగా సింక్ కాక పోవడం వల్లే మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని సినీ వర్గాల బోగట్టా.
ఇది పక్కన పెడితే తాజాగా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం పలు స్టిల్స్ లలో దర్శనం ఇచ్చింది మాళవిక మోహన్. మానసి సావంత్ ఫోటోలు తీయగా, ధ్రువ్ డేవ్ తనకు రంగులు అద్దారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక మాళవిక మోహన్ స్వస్థలం కేరళ. తను ఆగస్టు 4, 1993లో పుట్టింది. సినిమా నటిగా, మోడల్ గా గుర్తింపు పొందింది. ప్రధానంగా తను మలయాళం, తమిళం, హిందీ భాషలలో నటించింది. తన తొలి చిత్రం పట్టం పోలే, తమిళంలో అత్యంత జనాదరణ పొందిన సినిమాలు దళపతి విజయ్ నటించిన పెట్టా, మాస్టర్ మూవీలలో కీ రోల్ పోషించింది మాళవిక మోహన్.


















