Sandeep Kishan : తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన నటుడు తళపతి విజయ్. తను ఇటీవలే పార్టీ పెట్టాడు. ఆఖరి సినిమా 69వ పేరుతో తీస్తున్నాడు. ఇది కూడా షూటింగ్ పూర్తి జరుపుకునే స్టేజ్ లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా విజయ్ తనయుడు జాసన్ విజయ్ సంచలనంగా మారాడు. తను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాను తీస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు తెలుగు వారికి పరిచయమైన నటుడు సందీప్ కిషన్ (Sandeep Kishan). ఈ సందర్బంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Sandeep Kishan Comments
తనకు ఇప్పుడు 25 ఏళ్లు. ప్రపంచం త్వరలోనే అతని కృషి, నిజాయితీ, వాస్తవికతను చూసి తప్పకుండా విస్తు పోయే రోజు వస్తుందన్నాడు. ప్రత్యేకించి నా దర్శకుడికి దేవుడు బహుమతిగా ఇచ్చిన చిన్న తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. మీ హృదయ పూర్వకమైన ఉత్సాహం ప్రశాంతత చుట్టూ ప్రతిరోజూ ఉండటం నన్ను విస్తు పోయేలా చేసిందన్నాడు. జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో సంవత్సరాన్ని ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా బ్యానర్ నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి చిత్ర పరిశ్రమలోని ఉత్తమ సంగీత దర్శకులలో ఒకరైన థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దీనికి జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. తెలుగు నటి ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 2025లోకి అడుగు పెడుతున్నప్పుడ LYCA ప్రొడక్షన్స్, జాసన్ సంజయ్ తో కలిసి కొత్త చిత్రంతో ఉత్తేజకరమైన ప్రారంభాన్ని ప్రారంభించడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పంచుకున్నారు సందీప్ కిషన్.
Also Read : Minister Ponnam Fired on Kishan Reddy : కిషన్ రెడ్డి..రాజీనామా చేసి మాట్లాడు – పొన్నం



















