హైదరాబాద్ : ప్రముఖ నటుడు, నిర్మాత, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన పలు సూచనలు చేశారు. సభ్య సమాజం తనను చూసి సిగ్గు పడుతోందన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుడు మాటలు మాట్లాడితే ఎలా అని ఆవేదన చెందారు. తనను ఏఐసీసీ ఎందుకు ఎంపిక చేసిందో ఒకసారి పునరాలోచించు కోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి సీఎంగానే కాకుండా విద్యా శాఖ కూడా తన చేతుల్లోనే ఉందన్నారు. పిల్లులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏం నేర్పాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు చిట్టిబాబు.
ఎంత శత్రువు అయినా సరే ఇంకొకరి చావును కోరుకోరని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలలో ఆరోగ్య కరమైన విమర్శలు, ఆరోపణలకు తావు ఉండాలే తప్పా వ్యక్తిగతంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉండ కూడదని అన్నారు చిట్టిబాబు. మహిళలు సైతం సిగ్గుతో తల దించుకునేలా తను మాట్లాడుతున్నాడని, కనీసం ఇంట్లో వారైనా తనకు అలా మాట్లాడ వద్దని చెప్పాలని సూచించారు . ఈ ప్రపంచంలో ఇంత దరిద్రమైన బూతులు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడేనని ఆవేదన వ్యక్తం చేశారు నటుడు, నిర్మాత. తెలంగాణ ప్రజలు సింహన్ని పంపించి చిట్టెలుకను కూర్చోబెట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మరాయి సినీ ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాలలో.



















