విజయవాడ : ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సానుకూల వాతావరణం ఉన్నపుడు లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపణలు చేశారు . కులమత విద్వేషాలు పెంచేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చట్ట పరిధిలో మత విద్వేషాలు రేకెత్తిస్తున్న వారిపై చర్యలుండాలని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వీడియో మెసేజ్ లు పంపుతూ విద్వేషాలు రేకెత్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవని ఇప్పటికే కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు స్పష్టం చేసిందన్నారు.
హిందూత్వ మూలాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా మాట్లాడారు జగన్ అంటూ తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. విద్వేషాలు ఊతమిచ్చేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలున్నాయని ఆవేదన చెందారు సత్య కుమార్ యాదవ్. మావిగన్ పై జగన్ చెప్పాలని, ఆయనకే అర్ధం కావాలన్నారు. తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జగన్ నోట అమరావతి, ఆ తరువాత మూడు రాజధానులు, ఇప్పుడు మావిగన్ పేరుతో నాటకం మొదలు పెట్టాలన్నారు. జగన్ హయాంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయ లేదన్నారు. మావిగన్ అనే అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారని పేర్కొన్నారు సత్యకుమార్ యాదవ్. పొంతన లేకుండా మాటలు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. స్ధానిక ఎన్నికల కోసం ప్రత్యేక ఆలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. స్ధానిక ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పై ముందుకు వెళుతున్నామన్నారు.
