కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన టీఎంసీ పార్టీ చీలి పోయింది. దీనిని నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించాడు అమిత్ చంద్ర షా. తన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తాజాగా టీఎంసీ చైర్ పర్సన్ పదవి నుంచి మాజీ సీఎం మమతా బెనర్జీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది వ్యతిరేక వర్గం. మరో వైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’ కారణంగా టీఎంసీ ఎనిమిది మంది నాయకులను బహిష్కరించింది. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఒక తిరుగుబాటు వర్గం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కమిటీ’కి కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ప్రకటించింది. అరూప్ రాయ్‌ను దాని చైర్‌పర్సన్‌గా నియమించిన నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
దీంతో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం నాడు కీలక సీనియర్ నాయకులను పార్టీ నుండి బహిష్కరించింది. బహిష్కరించ బడిన నాయకులలో జావేద్ అహ్మద్ ఖాన్, ఫిర్హాద్ హకీమ్, అరూప్ రాయ్, రథిన్ ఘోష్, బిప్లబ్ మిత్ర, సబీనా యాస్మిన్, అరూప్ బిశ్వాస్, స్నేహసిస్ చక్రవర్తి ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏఐటీఎంసీ అంతకు ముందే ఈ నాయకులకు ‘షో-కాజ్’ నోటీసులు జారీ చేసింది. పార్టీలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్గదర్శిగా వ్యవహరించాలని పునరుద్ఘాటిస్తూనే, వారు 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

















