హైదరాబాద్ : విశ్వకర్మలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఏసీపీ కిరణ్ కుమార్. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు గా పోటీ చేసిన, గెలిచిన విశ్వకర్మ అభ్యర్థులకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో అభినందన సభ బషీరుబాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజలు మిమ్మల్ని దీవించి గెలిపించారని, వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము కానివొద్దని అన్నారు. గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. విశ్వకర్మలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ ప్రాతినిథ్యం లేకపోతే మనం మన వాటాను, హక్కుల్ని కోల్పోతున్నామనే విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు గా బరిలో నిలవడమే విశ్వకర్మ రాజ్యాధికార పునాది అని డా. హరికాంత్ ఆచారి అన్నారు.
కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ మనం రాజకీయంగా పట్టు సాధించక పోతే జాతి మరింత పతనమైపోయే ప్రమాదం ఉందని అన్నారు. విశ్వకర్మల్లో చైతన్యం వచ్చిందని, విశ్వకర్మలకు సముచిత ప్రాధాన్యం కల్పించకపోతే అన్ని పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కూరెళ్ళ శివరామ్ మాట్లాడుతూ అభ్యర్థులందరికీ అభినందలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వకర్మలు వృత్తులుగా విడిపోవడంతో బలహీనప డుతున్నామని, విశ్వకర్మలంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు రామోజు చంద్రమౌళి, గీత రాణి సుధాకర్, వెంకట రమణాచారి, సాయికృష్ణ, ప్రశాంత్ చారి, మల్లచారి, సునంద శ్రీనివాస్, సంతోష్, శానగొండ మల్లికార్జున, రాజేష్ చారి, యన్మనగండ్ల రమేష్ చారి, ప్రభాకరాచారి, బీబీనగర్ అనురాధ, గంగ భవాని, అద్దంకి కృష్ణమాచారి, స్థపతి తదితరులు పాల్గొన్నారు.
