పోలీస్ శాఖ లో జ‌వాబుదారీత‌నం పెరగాలి : సీఎం

పోలీస్ అధికారుల సమావేశం లో రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పోలీస్ శాఖ లో బాధ్య‌త మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పోలీస్ శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ప్రభుత్వ ఆలోచన పంచు కోవాలన్నదే సమావేశ ఉద్దేశం అన్నారు. వ్యవస్ట లో అందరూ భాగస్వాములేన‌ని, దాటి వెళ్తామంటే ఒప్పుకోమ‌ని సుతిమెత్త‌గా హెచ్చ‌రించారు. అలాంటి అధికారులను ప్రభుత్వం ఉపేక్షించ‌ద‌న్నారు. ఎవరైనా హెడ్ క్వాటర్స్ వదలాలంటే తప్పని సరి గా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. క్రైమ్ రివ్యూ మీటింగ్స్ తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ లు నిరంతరం జిల్లా లో పర్యటించాలని ఆదేశించారు. ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాల‌ని పేర్కొన్నారు.

రౌడీ షీటర్ల పైన నిరంతరం పర్యవేక్షణ ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. క్రైమ్ అప్గ్రేడ్ అవుతుందని, .దానికి అనుగుణంగా పోలీసింగ్ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గంజాయి రవాణాను అరికట్టాలి..ప్రత్యేక నిఘా పెట్టాల‌న్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని వాహనాలు ఈవీ కి మారాల‌ని ఆదేశించారు డీజీపీని. శాంతి భద్రతల విషయం లో నిర్లక్ష్యంగా ఉంటే సహించ బోమ‌న్నారు. కాలం చెల్లిన ఆయుధాలను తొలగించాలని సూచించారు. పెట్రోలింగ్ ను బలోపేతం చేయాలని, విలేజ్ పోలిసింగ్ వ్య‌వ‌స్థ‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు సీఎం. రౌడీ షీట్, హిస్టరీ షీట్ ల పైన రివ్యూ చేయాల‌న్నారు. ఎఫ్ ఎస్ ఎల్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. వచ్చే 10 ఏళ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేయాల‌న్నారు.

Exit mobile version