ACA Chief Bandaru Interesting : ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షుడిగా బండారు

ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు ప్ర‌క‌టించిన రిటర్నింగ్ ఆఫీస‌ర్

Hello Telugu - ACA Chief Bandaru Interesting

Hello Telugu - ACA Chief Bandaru Interesting

ACA : విజ‌య‌వాడ : ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ) ఉపాధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు బండారు న‌ర‌సింహారావు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఏసీఏ (ACA) చీఫ్ , ఎంపీ కేశినేని చిన్ని అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది వ‌ర్చువ‌ల్ స‌మావేశం. ఈ ఎన్నిక‌కు రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రించారు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. కీల‌క‌మైన ప‌రిపాల‌నా ప‌ద‌వికి న‌ర‌సింహారావు ఎన్నికైన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. సంస్థ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో గుంటూరు న్యూ క్రికెట్ క్లబ్ సభ్యుడు బండారు నరసింహారావు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ACA Chief

ఈ సంద‌ర్బంగా ఏక‌గ్రీవంగా త‌న‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షుడిగా ఎన్నుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏసీఏ చీఫ్ , ఎంపీ కేశినేని శివ‌నాథ్ , రాజ్య‌సభ ఎంపీ సానా స‌తీష్ బాబు, ఏసీఏ క‌మిటీ స‌భ్యులు, అపెక్స్ స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు బండారు న‌ర‌సింహారావు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు బండారు. రాష్ట్రంలో త‌మ అసోసియేష‌న్ త‌ర‌పున కీల‌క మార్పులు తీసుకు వ‌స్తామ‌న్నారు. క్రికెట్ కు ఉన్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు. స్టేడియంల‌ను నిర్మిస్తామ‌ని, ఉన్న‌వాటిని ఆధునీక‌రిస్తామ‌ని, అంతే కాకుండా యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి రాష్ట్ర‌, జాతీయ స్థాయి జ‌ట్ల‌కు ఎంపిక అయ్యేలా చేస్తామ‌న్నారు.

Also Read : Prashant Kishor Shocking Comments : ఆ ముగ్గురు నేత‌లు కాలం చెల్లిన మందులు

Exit mobile version