ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : రాజ‌గోపాల్ రెడ్డి

ఆంధ్రా ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌కు సీరియ‌స్ వార్నింగ్

hellotelugu-KomatireddyRajagopalReddy

హైద‌రాబాద్ : మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌, ఏబీఎన్ సీఎండీ రాధాకృష్ణ‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆధారాలు లేకుండా వార్త‌లు రాయ‌డం మానుకుంటే మంచిద‌న్నారు. ప్ర‌ధానంగా ఆంధ్రా మీడియా గీత దాటి ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని, త‌గ్గి ఉండ‌క పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు రాజ‌గోపాల్ రెడ్డి. ఆయ‌న ప్ర‌ధానంగా డిప్యూటీ సీఎం భ‌ట్టితో క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌మ గురించి రాసే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకుని రాయాల‌ని సూచించారు. ఇంకోసారి అన‌వ‌స‌రంగా గెలికినా లేదా రోత‌పు రాత‌లు రాసినా బావుండ‌ద‌ని అన్నారు.

కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. పేప‌ర్, ఛాన‌ల్ ను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతే బాగుండ‌ద‌న్నారు. నీకంటే ఎక్కువ‌గా త‌మ‌కు కూడా పేప‌ర్, ఛాన‌ల్ పెట్టే ద‌మ్ముంద‌న్నారు. తాము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదని, ఏ పేపర్ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌ద‌న్నారు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంద‌న్నారు. కానీ ఏబీఎన్ ఛాన‌ల్ ప‌నిగ‌ట్టుకుని సీఎం రేవంత్ రెడ్డికి వంత పాడుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక‌రి మెప్పు కోసం ఇంకొక‌రిని త‌క్కువ చేసేలా ప్రచురించినా, ప్ర‌సారం చేసినా చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు ఎమ్మెల్యే .మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు తీవ్రంగా హెచ్చ‌రించారు. మీరు మాకు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Exit mobile version