అభిషేక్ కు అనారోగ్యం శాంస‌న్ కు అవ‌కాశం

న్యూఢిల్లీలో న‌మీబియాతో టి20 రెండో మ్యాచ్

hellotelugu-SanjuSamson

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ వేదిక‌గా భార‌త జ‌ట్టు న‌మీబియాతో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా 2వ మ్యాచ్ ఆడ‌నుంది. మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ స్థానంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఆడ‌నున్న‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఘోరంగా విఫ‌లం అయ్యాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌ను కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 10, 6, 0, 24, 6 ర‌న్స్ మాత్ర‌మే చేసి తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు. దీంతో జ‌ట్టు యాజ‌మాన్యం త‌న‌ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌ప్పించింది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ భార‌త జ‌ట్టు అమెరికా జట్టుతో ఆడింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ల దెబ్బ‌కు భార‌త బ్యాట‌ర్లు విల విల లాడారు. 161 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయింది ఇండియా . ఈ త‌రుణంలో జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు.

ఇదిలా ఉండ‌గా స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ తొలి మ్యాచ్ లో నిరాశ ప‌రిచాడు. అయితే త‌ను క‌డుపు నొప్పి, జ్వ‌రంతో బాధ ప‌డుతున్నాడు. దీంతో ఓపెనింగ్ చేసేందుకు జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంస‌న్ ను ఆడించాల‌ని, త‌న‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాల భోగ‌ట్టా. మ‌రో వైపు గ‌త ఏడాది కాలంగా సూర్య కుమార్ ఆడ‌క పోయినా బీసీసీఐ కంటిన్యూ చేస్తూ వ‌చ్చింద‌ని, సంజూ శాంస‌న్ కు మ‌రోసారి ఆడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని అభిమానుల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు కోరుతున్నారు. మ‌రి ఛాన్స్ ద‌క్కుతుందా లేక బెంచ్ కే శాంస‌న్ ప‌రిమితం అవుతాడా అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

Exit mobile version