హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులకు కొత్త సంవత్సరం సందర్భంగా బిగ్ షాక్ తగిలింది. 24/7 సంగీత వీడియోల కోసం అంకితమైన ఎంటీవీ ఛానెళ్లు శాశ్వతంగా మూసి వేయబడ్డాయి, ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన వీడియోకు నివాళి అర్పిస్తూ: బగ్గిల్స్ వారి ఐకానిక్ వీడియో కిల్డ్ ది రేడియో స్టార్ పాటను ప్రసారం చేశాయి.ఈ శరదృతువు ప్రారంభంలో ఎంటీవీ 2025లో తన 24-గంటల సంగీత ఛానెళ్లను మూసి వేస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80s, ఎంటీవీ 90s, క్లబ్ ఎంటీవీ,, ఎంటీవీ లైవ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంటీవీ స్టేషన్‌లపై ప్రభావం చూపింది.
ప్రధాన ఎంటీవీ మ్యూజిక్ ఛానెల్ తన దశాబ్దాల ప్రస్థానాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా ముగించింది, అది ప్రారంభమైన విధంగానే, ఆగస్టు 1, 1981న ఎంటీవీని ప్రారంభించిన బగ్గిల్స్ వారి “వీడియో కిల్డ్ ది రేడియో స్టార్” మ్యూజిక్ వీడియోను ప్రసారం చేసింది. బీబీసీ జర్నలిస్ట్ జోనో రీడ్, ఛానెల్ ప్రసారం ఆగిపోయిన క్షణాన్ని వీడియో తీసి ఎక్స్ పోస్ట్‌లో పంచుకున్నారు. యుకె.లోని ప్రతి ఛానెల్ వేర్వేరు చివరి వీడియోలను ప్రసారం చేసింది, ఎంటీవీ 90s స్పైస్ గర్ల్స్ వారి గుడ్ బై పాటను ప్రసారం చేసింది. ఇదిలా ఉండగా అమెరికాలోని ఎంటీవీ కానీ దాని మాతృ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇదిలా ఉండగా ఎంటీవీ ఆగస్టు 1981లో అమెరికాలో ప్రారంభమైంది, ఆ తర్వాత ఆగస్టు 1987లో యుకె, ఐర్లాండ్ లో ప్రారంభమైంది. ఇక ఎంటీవీ కార్యక్రమాలలో చాలా వరకు ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు కాకుండా రియాలిటీ షోలే ఉన్నాయి . పారామౌంట్ సీఈవో డేవిడ్ ఎల్లిసన్ ఎంటీవీని తిరిగి ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు ప్రకటించాడు.
