హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ ప్రారంభమైంది. అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. నిన్నటి దాకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ను తూలనాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి అందరినీ ఆశ్చర్య పరిచేలా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు సీఎం. దీంతో తాను వస్తానంటూ ప్రకటించాడు. ఊహించని విధంగా ఆశ్చర్య పరిచాడు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా శాసన సభలో ఆసీనులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా అభివాదం చేశారు. సీఎం రాకను గమనించిన కేసీఆర్ లేచి కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సీఎం, మాజీ సీఎంలు ఇద్దరూ లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇతర సభ్యులను విస్తు పోయేలా చేసింది. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం, యోగక్షేమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ విష్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా ఉన్నారు. వారు కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అభివాదం చేశారు.



















