న్యూఢిల్లీ : సమాజ సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న ఏ. పద్మాచారికి భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “భారత్ సమాజ సేవ రత్న అవార్డు – 2026” ప్రదానం చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ అవార్డును ఆల్ మీడియా కౌన్సిల్ ఫౌండేషన్ ఘనంగా అందజేసింది. ఈ అవార్డును మాజీ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ ) చైర్మన్ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ సురేందర్ చౌదరి, ఆల్ మీడియా కౌన్సిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ జ్ఞానేంద్ర విశ్వకర్మ, అలాగే హెచ్.హెచ్. మహారాజా శ్రీమంత్ రామ్‌లక్ష్మణ్ సింగ్ పాల్గొన్నారు.
సమాజ సేవ, ప్రజా సంక్షేమం, దేశ నిర్మాణానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సామాజిక సేవకులు, ఎన్‌జీవోలు, బ్యూరోక్రాట్లు మరియు వినోద రంగ ప్రముఖులను ఆల్ మీడియా కౌన్సిల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం సత్కరిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా ఏ. పద్మాచారి మాట్లాడుతూ, తన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవించిన ఆల్ మీడియా కౌన్సిల్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను, సమాజ సేవలో ఇంకా ఎక్కువ అంకితభావంతో పనిచేయాలనే ప్రేరణను ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు.
