కర్ణాటక లో ఘోర బ‌స్సు ప్రమాదం

18 మందికి పైగా సజీవ దహనం

hellotelugu-KaarnatakaBusFre

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క‌లో ఘోర బస్సు ప్ర‌మాదం గురువారం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 18 మందికి పైగా ప్ర‌యాణీకులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బ‌స్సును లారీ ఢీకొట్టింది. దీంతో బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. అక్క‌డిక‌క్క‌డే ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. బెంగ‌ళూరు నుంచి గోక‌ర్ణ‌కు వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది ట్రావెల్స్ బస్సు. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం జ‌రగ‌డంతో ఒక్క‌సారిగా విషాదం అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

కాగా మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసు వ‌ర్గాలు పేర్కొంటున్నారు. ఎక్కువ శాతం మృతి చెందిన వారంతా గోక‌ర్ణ ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. కొంద‌రిని ఇప్ప‌టికే గుర్తించారు. బ‌స్సులో జ‌ర్నీ చేస్తున్న స‌మ‌యంలో 31 మంది ప్ర‌యాణీకులు ప్ర‌యాణం చేస్తున్న‌ట్లు స‌మాచారం. బ‌స్సు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ర‌హ‌దారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు నిలిచి పోయాయి. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు చిత్ర‌దుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు పోలీసులు. జాతీయ ర‌హ‌దారి 48 పై చోటు చేసుకున్న ఘ‌ట‌న‌తో ఇది రెండోది కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీలోని క‌ర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది బ‌స్సు ప్ర‌మాదం.

Exit mobile version