చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విజయంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన అట్లీ కుమార్ పుట్టిన రోజు ఇవాళ. సెప్టెంబర్ 21న దేశ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళంలో మాస్ సినిమా నిర్వచనాన్ని నిరంతరం మారుస్తూ వచ్చిన దర్శకుడు అట్లీ కుమార్ 40వ వడిలోకి అడుగుపెడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమ ఆయనను ఘనంగా అభినందిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుండి దేశంలోని అత్యంత విజయవంతమైన కథకులలో ఒకరిగా ఎదిగిన ఆయన అద్భుత ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు హృదయ పూర్వక సందేశాలు, పాత జ్ఞాపకాల ఫోటోలు, శుభాకాంక్షలతో నిండి పోయాయి. అల్లు అర్జున్‌తో ఆయన చేయబోయే తదుపరి చిత్రం ‘రాకా’. ఇది ఒక భారీ స్థాయి చిత్రం కానుంది.
ఇక దర్శకుడు అట్లీ గురించి చెప్పాలంటే ఆయన అసలు పేరు అరుణ్ కుమార్. తమిళ సినిమా నుంచి వచ్చ జవాన్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో కూడా గుర్తింపు పొందిన దర్శకుడు, స్క్రీన్‌రైటర్, నిర్మాత. తన స్వస్థలం తమిళనాడులోని మధురైలో 1986 సెప్టెంబర్ 21న పుట్టాడు. అట్లీ మొదట ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత 2013లో రాజా రాణిiతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు అవార్డు కూడా అందుకున్నారు. అట్లీ తన భార్య ప్రియా అట్లీతో కలిసి యాపిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. 2026 నాటికి అట్లీ తదుపరి ప్రాజెక్టుల్లో బన్నీతో రాకా సినిమా తీస్తున్నాడు.


















