ఏపీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అనకాపల్లి జిల్లాలో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలమంచిలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగింది . ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపి వేశాడు. పెను ప్రమాదం జరగకుండా అప్రమత్తం అయ్యాడు. ఈ మంటలు ఎక్స్ ప్రెస్ రైలు లోని బి1 కోచ్‌లో చెలరేగాయి. ఆ తర్వాత రైల్వే సిబ్బంది అగ్ని ప్రమాదానికి గురైన కోచ్‌లను మిగిలిన రైలు నుండి వేరు చేశారు.
రైలు ఎలమంచిలి స్టేషన్‌లో ఆగగానే, భయపడిన ప్రయాణికులు కోచ్‌ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా ఎం1, బి2 అనే రెండు కోచ్‌లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి అందరూ చూస్తూ ఉండగానే. ఇదిలా ఉండగా ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ఘటనకు సంబంధించి రైల్వే శాఖ స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు రైల్వే అధికారులు . రైలు ఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ జీఎం విచారణకు ఆదేశించారు.
