కోయంబత్తూరు : ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తను 1990లో టాప్ హీరోయిన్ గా పేరు పొందింది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. ఉన్నట్టుండి తనలోని టాలెంట్ ను గుర్తించాడు శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సందర్బంగా తను తీసిన మూవీలో రవీనా టాండన్ కు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో మరోసారి తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుల గుమ్మ. తన కూతురు కూడా సూపర్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందింది. ఇక రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక బాలీవుడ్ లో ఏజ్ పెరిగే కొద్దీ కొందరు ముసలివారిగా కనిపిస్తారు. కానీ కొందరు మాత్రం అత్యంత యవ్వనంతో కూడుకున్న నటీమణులుగా చెలామణి అవుతున్నారు .
వీరిలో టాప్ లో కొనసాగుతున్నారు ప్రముఖ నటీమణులు రేఖ, మాధురీ దీక్షిత్, నీనా గుప్తా, సోనాలీ బెంద్రే, అయేషా జుల్కా, భాగ్యశ్రీ, తదితరులు ఉన్నారు. ప్రస్తుతం రెండో సారి కెరీర్ ను స్టార్ట్ చేశారు. వీరిలో మాధురీ తాజాగా ఓ హారర్ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక టాప్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారంతా యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి రవీనా టాండన్ కోయంబత్తూర్ లోని ప్రముఖ యోగా సెంటర్ యోగా సెంటర్ ను సందర్శించారు. దీనిని దర్శించు కోవడం జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందని పేర్కొంది వర్దమాన నటి. యోగాతో అనుబంధం మరిచి పోలేనంటూ తెలిపింది.



















