హైదరాబాద్ : యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. తమ మతాన్ని కించపర్చేలా చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో మత పరమైన మనోభావాలను కించ పరిచినందుకు యూట్యూబర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. యూట్యూబర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, వాటిని ప్రసారం చేసినందుకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని అన్వేష్‌కు సమన్లు జారీ చేశామన్నారు. ఇదిలా ఉండగా అన్వేష్‌ను దేశ ద్రోహిగా ప్రకటించాలని హిందూ సమాజం తరపున కళ్యాణి మద్దతుదారులు డిమాండ్ చేశారు, ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
యూట్యూబర్ అన్వేష్‌పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 352, 79, 299 , ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా అవమానించడం, మహిళల గౌరవాన్ని కించపరిచే ఉద్దేశం, మత పరమైన మనోభావాలను కించపరిచే దురుద్దేశ పూరిత చర్యల కింద పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్‌పై కేసులు నమోదు చేశారు. బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్వేష్‌పై కేసులు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, వాటిని ప్రసారం చేసినందుకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని పోలీసులు అన్వేష్‌కు సమన్లు జారీ చేశారు. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని కళ్యాణి మద్దతుదారులు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు.















